బెంగళూర్ : కర్నాటకలోని చిత్రదుర్గలో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యభిచార రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. సీక్రెట్ టాయ్‌లెట్ డోరు ద్వారా నిందితుడు చీకటి దందాను సాగిస్తుండటం పోలీసులకు షాక్ ఇచ్చింది.
ఈ రహస్య ద్వారం లోనుంచి నిందితుడు కస్టమర్లను లోపలికి పంపుతున్నాడని గుర్తించారు. టాయ్లెట్లో అమర్చిన సీక్రెట్ డోర్ ద్వారా గుట్టుగా సాగుతున్న సెక్స్ రాకెట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ రాకెట్‌కు సంబంధించి ముగ్గురు వ్యక్తులను చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. టాయ్‌లెట్ లోపల ఏర్పాటు చేసిన సీక్రెట్ డోర్‌ను టైల్స్‌లో కప్పివేస్తూ ఎవరూ గుర్తించని రీతిలో అమర్చారు. టాయ్‌లెట్ లోపల చిన్న డోర్ టైల్స్‌కు వాడిన కలర్స్‌లో ఉండటంతో ఎవరూ గుర్తుపట్టని విధంగా ఉంది.