Pd act | రౌడీషీటర్ బిల్లా పవన్‌పై పీడీయాక్టు

బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రజలను భయాందో ళనలకు గురిచేస్తున్న రౌడీషీటర్ గువ్వల పవన్‌కుమార్ అలియాస్ బిల్లా పవన్ (28) పై పీడీ యాక్టు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్లా పవన్ రహ్మత్‌నగర్‌లోని వీడియో గల్లీలో నివాసం ఉంటున్నాడు.
బిల్లా పవన్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని శ్రీకృష్ణానగర్, రహ్మత్‌నగర్ తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ బెదిరింపులకు పాల్పడడం, దాడులకు దిగడం, మామూళ్లు వసూళ్లు చేయడం తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అతడి వ్యవహారశైలిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో బిల్లా పవన్ మీద పీడీ యాక్టు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
దీంతో గురువారం బిల్లా పవన్ మీద పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలిం చారు. కాగా 2018లో కూడా ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడడంతో బిల్లా పవన్ పీడీయాక్ట్ కింద జైలుకు వెళ్లాడు. కాగా జైలునుంచి విడుదలైన తర్వాత కూడా నేర ప్రవృత్తిని మార్చుకోకపోవడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతుండడంతో మరోసారి పీడీ యాక్ట్ కింద జైలుపాలయ్యాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

