ఐదు వేల అప్పు తీర్చేందుకు.. కుమార్తెను అమ్మిన తండ్రి

భువనేశ్వర్: ఐదు వేల అప్పు తీర్చేందుకు ఒక తండ్రి ఏకంగా తన రెండున్నర ఏండ్ల కుమార్తెను అమ్మాడు. విషయం తెలుసుకున్న ఆ పాప తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మద్యానికి బానిస అయిన రమేశ్ కుమార్ బారిక్, బిన్జార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహదేవ్పూర్ గ్రామానికి చెందిన లిటు జెనా నుండి రూ .5 వేలు అప్పు తీసుకున్నాడు. కాగా, రెండున్నర ఏండ్ల బిడ్డను వదిలి రమేశ్ భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పు తీర్చాలని అడిగిన లిటుకు తన కుమార్తెను రమేశ్ అప్పగించాడు. విషయం తెలుసుకున్న పాప తాత రవీంద్ర బారిక్ తన కుమారుడు రమేశ్‌తోపాటు లిటు జెనాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పిల్లల సంరక్షణ అధికారులు ఆ చిన్నారిని రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. మరోవైపు రూ.5 వేల అప్పు తీర్చేందుకు చిన్నారిని తండ్రి అమ్మిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

