ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి యత్నం

- అలారం మోగడంతో పరార్..
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- గండిమైసమ్మ బ్రాంచిలో గోడకు కన్నం కొట్టిన దుండగుడు
దుండిగల్, మే 6 : ముత్తూట్ ఫైనాన్స్‌లో గుర్తుతెలియని దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించగా.. లాకర్ తెరిచే క్రమంలో అలారం మోగడంతో అక్కడినుంచి పరారయ్యాడు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నగర శివారు గండిమైసమ్మ చౌరస్తాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ చౌరస్తాలో గత కొన్నేండ్లుగా ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ కొనసాగుతున్నది. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం సిబ్బంది విధులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం సిబ్బంది పైనాన్స్ కార్యాలయానికి చేరుకోగా వెనుకవైపు గోడకు కన్నం వేసి ఉండటం గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీ పుటేజీలను పరిశీలించగా బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వెనుకవైపు గోడకు కన్నం వేసిన ఓ దుండగుడు లోనికి ప్రవేశించినట్లు గుర్తించారు. సుమారు 10 నిమిషాల పాటు కార్యాలయం హాల్లోనే ఉన్న దుండగుడు లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో భయాందోళనకు గురైన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కార్యాలయంలోని నగదు, బంగారు ఆభరణాలు చోరీ కాలేదని సిబ్బంది పేర్కొన్నారు. ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మమ్మురం చేశారు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Muthoot finance
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

