హైదరాబాద్ : ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముషీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) పై స్థానికులు దాడి చేశారు. సర్టిఫికెట్ కోసం వెళ్లిన యువతి పట్ల ఆర్ఐ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా రావాలని యువతికి ఆయన చెప్పాడు. దీంతో ఆమె ఇవాళ తన తల్లిదండ్రులను తీసుకొని.. ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లింది. తల్లిదండ్రుల ఎదుటే విజయ్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా విజయ్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.