హోటల్ గదిలో ప్రియురాలిని గన్‌తో కాల్చి చంపిన వ్యక్తి.. ఆపై ఆత్మహత్యా యత్నం
తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న హాటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, గీతను ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ: ఒక వివాహిత వ్యక్తి హోటల్ గదిలో ప్రియురాలిని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల ప్రవీణ్ అలియాస్ సీతు, 39 ఏళ్ల ప్రియురాలు గీతతో కలిసి మంగళవారం నరేలా ప్రాంతంలోని హోటల్ గదిలో బస చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్ తన వద్ద ఉన్న పిస్టల్‌తో గీత ఛాతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తన తలపై కాల్చుకున్నాడు.
కాగా, తుపాకీ పేలుడు శబ్ధాలు విన్న హాటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, గీతను ఆసుపత్రికి తరలించారు. అయితే గీత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన ప్రవీణ్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మరోవైపు నిందితుడు ప్రవీణ్ రెండు నెలల కిందట కూడా ఒకరిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 21న గౌరవ్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపినట్లు చెప్పారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో అరెస్టైన ప్రవీణ్, ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యాడని పోలీసులు తెలిపారు. అతడి భార్య, పిల్లలు గ్రామంలో ఉంటున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Delhi
- girlfriend
- Married Man
- shoots
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

