పందుల పెంపకంపై వివాదం.. కాల్పుల్లో వ్యక్తి మృతి

న్యూఢిల్లీ: పందుల పెంపకంపై వివాదం నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సందీప్ చందోలియా కుటుంబం పందులను పెంచుతున్నది. పొరుగున ఉన్న విక్కీ కుటుంబం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు కుటుంబాలు ఈ విషయంపై ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుపై కేసులు నమోదు చేశారు.
పందుల పెంపకం విషయంలో ఆదివారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి సర్ది చెప్పారు. కాగా, సోమవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
విక్కీ, రాకీ జరిపిన కాల్పుల్లో సందీప్ కుటుంబానికి చెందిన వికాశ్, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా వికాశ్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కడుపులో బులెట్ గాయమైన సురేష్‌కు చికిత్స అందిస్తున్నారు. నిందితులు విక్కీ, రాకీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

