ఐస్‌క్రీమ్‌లో ఎలుకల మందు కలిపిన తండ్రి.. ఐదేండ్ల కుమారుడు మృతి

ముంబై: భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి ఐస్‌క్రీమ్‌లో ఎలుకలను చంపే మందు కలిపి తన ముగ్గురు పిల్లలకు ఇచ్చాడు. అది తిన్న ఐదేండ్ల బాలుడు మరణించగా మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని మన్ఖుర్డ్ శివారులో ఈ ఘటన జరిగింది. మహ్మద్ అలీ నౌషద్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన భార్యతొ గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలను చంపాలనుకుని ఐఎస్క్రీమ్లో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. అది తిన్న ఐఏండ్ల అలీషాన్ అలీ మొహమ్మద్ విషప్రయోగం వల్ల మరణించగా, మరో ఇద్దరు పిల్లలు ఏడేండ్ల అలీనా, రెండేండ్ల అర్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్త మహ్మద్ అలీ నౌషద్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

