కూతురి లవ్ మ్యారేజ్‌పై రగిలిన తండ్రి : కిరాయి హంతకులతో అల్లుడిని కడతేర్చాడు
కూతురి ప్రేమ వివాహంపై రగిలిపోయిన తండ్రి కిరాయి హంతుకులతో ఒప్పందం చేసుకుని అల్లుడిని కడతేర్చిన ఉదంతం కలకలం రేపింది.
పట్నా : కూతురి ప్రేమ వివాహంపై రగిలిపోయిన తండ్రి కిరాయి హంతుకులతో ఒప్పందం చేసుకుని అల్లుడిని కడతేర్చిన ఉదంతం కలకలం రేపింది. పట్నాలోని బర్ ప్రాంతానికి సమీపంలోని సవిత సినిమా హాల్ వద్ద జులై 12న గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో అంకిత్ కుమార్ మరణించాడు. అల్లుడిని కిరాతకంగా చంపించినందుకు ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన మామను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని బర్ ఏసీపీ అర్వింద్ కుమార్ సింగ్ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు అంకిత్ కుమార్ టప్పు సింగ్ కూతురిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం టప్పు సింగ్ ఇష్టానికి వ్యతిరేకంగా జరగడంతో అల్లుడిపై కోపం పెంచుకున్నాడు.
తన ఇష్టానికి వ్యతిరేకంగా తన కూతురిని అంకిత్ పెండ్లి చేసుకోవడంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్న సింగ్ తన అల్లుడిని చంపాలని రూ 4 లక్షలతో కాంట్రాక్టు కిల్లర్లతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా తమకు సింగ్ రూ 60,000 అడ్వాన్స్‌గా చెల్లించాడని, మిగతా మొత్తం హత్యానంతరం ఇస్తానని హామీ ఇచ్చాడని పట్టుబడిన షూటర్ తెలిపారు. అంకిత్‌ను కాల్చిచంపేందుకు అనువైన సమయం కోసం తాము మృతుడి షెడ్యూల్‌ను ట్రాక్ చేశామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- hires
- kill
- love marriage
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

