డేటింగ్ యాప్‌లో మహిళతో నగ్నంగా యువకుడు చాట్… డబ్బుల కోసం బ్లాక్మెయిల్
ముంబై: ఒక డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళతో యువకుడు నగ్నంగా చాట్ చేశాడు. అనంతరం అతడి వాట్సాప్‌కు ఆ వీడియో వచ్చింది. దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. అంధేరి ఈస్ట్‌లో ఎంబీఏ చదువుతున్న 24 ఏండ్ల విద్యార్థి మార్చి 31న ‘హింజ్’ అనే డేటింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సొహీనా అనే మహిళతో చాట్ చేశాడు. అయితే నగ్నంగా ఉన్న ఆమె, అతడ్ని కూడా దుస్తులు విప్పి నగ్నంగా మారి చాట్ చేయమని చెప్పింది. దీంతో ఆ యువకుడు అలాగే చేశాడు.
అనంతరం ఆ రాత్రి ఆ వ్యక్తి వాట్సాప్‌కు ఒక వీడియో క్లిప్ వచ్చింది. అతడు నగ్నంగా చాట్ చేస్తున్న వీడియో స్క్రీన్ షాట్ అందులో ఉంది. ఆ వీడియోను అతడి పేరెంట్స్తోపాటు ఇతరులకు షేర్ చేయకుండా ఉండాలంటే గూగుల్ పే ద్వారా రూ.10,000 ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి వచ్చిన మెసేజ్లోని గూగుల్ పే మొబైల్ నంబర్ సోను కుమార్ అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

