భార్యను కొట్టిన భర్త.. అడ్డుకోబోయిన పోలీస్‌పై దాడి

లక్నో: ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా కొట్టాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీస్పైనా అతడు దాడి చేశాడు. ఈ సందర్భంగా పోలీస్ యూనిఫాంను చించివేశాడు. దీంతో విధులను అడ్డుకున్నందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజ్నా గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ అనే వ్యక్తి తన భార్యను చావకొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రాజేంద్ర సింగ్ అక్కడకు వెళ్లారు. కొడుతున్న భర్త నుంచి అతడి భార్యను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఇది తమ వ్యక్తిగత విషయమంటూ పోలీస్‌పై రంజిత్ దాడి చేశాడు. అంతేగాక పోలీస్ చొక్కాను చించివేశాడు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రంజిత్ సింగ్ పిలుపుతో పోలీస్ టీం అక్కడకు వచ్చింది. నిందితుడు రంజిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్‌పై దాడి, విధులకు ఆటంకం కల్పించం, అడ్డుకోవడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

