దారుణం : బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడి..ఆపై వీడియో వైరల్!
బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాజస్దాన్లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది.
జైపూర్ : బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాజస్దాన్లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులంతా దాదాపు 20 ఏండ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు.
కిషన్గఢ్ బస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలిక ప్రైవేట్ ఫోటోలను సేకరించిన నిందితుడు రూ 50,000 ఇవ్వాలని లేకుంటే వాటిని బహిర్గతం చేస్తానని బెదిరించాడు. ఆపై ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మంది బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక సోదరుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. 2021 డిసెంబర్ 31న ప్రధాన నిందితుడు సాహిల్ పధకం ప్రకారం బాలికను నిర్జన ప్రదేశానికి పిలిపించాడు.
బాలిక రాగానే ఎనిమిది మంది నిందితులు ఆమె దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు గురి చేసి నేరాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఆపై బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను రూ 50,000 చెల్లించాలని బెదిరించగా డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులను వీడియోను స్ధానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- men
- Minor girl
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

