దారుణం : విహార యాత్ర కోసం బీచ్‌కు వచ్చిన బ్రిటన్ మహిళపై లైంగిక దాడి!
భర్తతో కలిసి విహార యాత్ర కోసం వచ్చిన బ్రిటన్ మహిళపై నార్త్ గోవాలోని అరంబల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది.
పనాజీ : భర్తతో కలిసి విహార యాత్ర కోసం వచ్చిన బ్రిటన్ మహిళపై నార్త్ గోవాలోని అరంబల్ స్వీట్ వాటర్ బీచ్ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. గత వారం ఈ దారుణం చోటుచేసుకోగా ఘటనకు సంబంధించి 32 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూన్ 2న మధ్యవయస్కురాలైన బ్రిటన్ మహిళ బీచ్‌లో సేదతీరుతుండటం గమనించిన నిందితుడు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నిందితుడిపై బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడిని సత్వరమే అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

