వాట్సాప్ గ్రూపులతో ఆన్లైన్ సెక్స్ రాకెట్ : ఇద్దరి అరెస్ట్
ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దమొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ : ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దమొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో సెక్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందన్న సమాచారంతో నోయిడా పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) సంయుక్త ఆపరేషన్ చేపట్టి చీకటి దందా సాగిస్తున్న ముఠా సభ్యులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నోయిడాలో చాలా కాలంగా ఆన్లైన్ వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తోంది.
గూగుల్‌లో వెబ్‌సైట్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా కస్టమర్లను వాట్సాప్ గ్రూపుల్లో చేరమని కోరతామని నిందితులు దర్యాప్తులో వెల్లడించారు. ఒప్పందం కుదరగానే తాము కస్టమర్ వద్దకు యువతులను పంపుతామని వారు తెలిపారని నోయిడా అదనపు డీసీపీ రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందని ఆరా తీస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

