Cheating | ఇంటి విక్రయం పేరుతో మోసం.. ఎన్ఆర్ఐలపై చీటింగ్ కేసు

బంజారాహిల్స్ : ఇంటి విక్రయం పేరుతో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీకి చెందిన మామిడి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అతడి కొడుకు మామిడి హరీష్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు.
అప్పుడప్పుడూ ఇండియాకు వచ్చి వెళ్తుండే చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం 2లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీలో తన కొడుకు పేరుమీద ఉన్న 500గజాల స్థలంలోని ఇంటిని అమ్ముతానంటూ ఫిలింనగర్‌లోని అపర్ణా ఆరాలో నివాసం ఉంటున్న వ్యాపారి శ్రీకాంత్ వట్టికూటిని నమ్మించారు.
తన కొడుకుపేరుతో ఉన్న ఈ ఇంటిపై ఎలాంటి వివాదాలు లేవని, తానే జీపీఏ హోల్డర్‌ను అని, బ్యాంకుల్లో రుణాలు లేవని, క్లియర్ టైటిల్‌తో పొజిషన్‌తో సహా సిద్దంగా ఉందంటూ నమ్మబలకడంతో రూ.7.75కోట్లకు బేరం కుదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వాన్స్‌గా రూ.25లక్షలు చెల్లించాలని కోరగా చంద్రశేఖర్‌రెడ్డి సూచనల మేరకు ఆయన కొడుకు హరీష్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో చెక్కుద్వారా జమచేశాడు.
అయితే నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీకాంత్ వాకబు చేయగా సదరు ఇంటిపై బ్యాంకులో రుణం ఉందని, కేసులు కూడా ఉన్నాయని తేలింది. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా ముఖం చాటేశాడు.
ఇటీవల ఇదే ఇంటిని రాజేష్‌రెడ్డి అనే వ్యక్తికి అధిక ధరకు అమ్మేందుకు మరో అగ్రిమెంట్ కుదుర్చుకోవడమే కాకుండా రూ.2కోట్ల దాకా అడ్వాన్స్ తీసుకున్నట్లు తేలడంతో చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అతడి కొడుకు హరీష్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వ కంగానే మోసానికి పాల్పడుతున్నారని గుర్తించిన శ్రీకాంత్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు చంద్రశేఖర్‌రెడ్డి, హరీష్‌రెడ్డిలపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

