పోలీస్ స్టేషన్లో టిక్ టాక్ వీడియో తీసిన యువకులు అరెస్ట్

లక్నో: పోలీస్ స్టేషన్లో టిక్ టాక్ వీడియో తీసిన నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఆగ్రాలోని జగదీష్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధపురి అవుట్‌పోస్ట్‌లో పోలీస్ సిబ్బంది లేకపోవడాన్ని నలుగురు యువకులు గమనించారు. దీంతో తమ మొబైల్ ఫోన్లో టిక్ టాక్ వీడియో తీశారు. ఒక పాటకు డ్యాన్స్ చేశారు. ఒక వ్యక్తి ఇన్స్‌స్పెక్టర్ కుర్చీలో కూర్చొని కాళ్లు టేబుల్‌పై పెట్టాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీస్ అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ అవుట్ పోస్ట్‌లో టిక్ టాక్ వీడియో తీసిన నలుగురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ అవుట్ పోస్ట్ ఎందుకు ఖాళీగా ఉన్నది?, ఆ యువకులు లోపలకు ఎలా వెళ్లారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కాగా, తాను మీటింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అవుట్‌పోస్ట్ ఇంచార్జి యోగేంద్ర కుమార్ తెలిపారు. మరోవైపు ఆ సమయంలో అవుట్‌పోస్ట్‌లో డ్యూటీలో లేని పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
Kuch dur chalte hi pic.twitter.com/9iDx3N4EJY
— Piyush Rai (@Benarasiyaa) August 4, 2021
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

