Watch: లిఫ్ట్‌లో చిక్కుకున్న వివాహ అతిథులు… రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
న్యూఢిల్లీ: లిఫ్ట్‌లో చిక్కుకున్న వివాహ అతిథులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. శక్తి నగర్ ప్రాంతంలోని గ్రీన్ లాంజ్ ఫ్యాషన్ మ్యారేజ్ హాల్లో గురువారం రాత్రి ఒక వివాహం సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి 12.45 గంటలకు ఈ ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.
అయితే అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్ వైర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వివాహానికి వచ్చిన అతిథుల్లో నలుగురు వ్యక్తులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు 65 ఏండ్లకుపైబడిన వృద్ధులు. ఒక మహిళ కూడా లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిలో ఉన్నది.
ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లిఫ్ట్‌లో వృద్ధులు ఉండటంతో వారు ఆందోళన చెందకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. లిఫ్ట్ పై భాగాన్ని కట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఆ లిఫ్ట్‌లోకి దిగి అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Firefighters Rescue Delhi Wedding Guests Stuck In An Elevator https://t.co/0Ski6LWOi7 pic.twitter.com/jmXt8uIXmO
— NDTV (@ndtv) April 22, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

