Cyber fraud | రెండు బ్యాంకు అకౌంట్లలో నుంచి రూ.73 లక్షలు చోరీ.. 34 ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్
Cyber fraud | డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్

డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.73 లక్షలు దొంగలించబడ్డాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బు అతని అకౌంట్లో నుంచి వేరే 34 అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆ 34 ఖాతాదారుల గురించి వివారాలు సేకరిస్తున్నారు.
దొంగతనం ఎలా జరిగిందంటే..
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో నివసిస్తున్న డాక్టర్ అరుణ్ కుమార్‌కు ఒక రోజు ఫోన్లో మెసేజ్ వచ్చింది. అందులో అతని బ్యాంకు అకౌంట్ క్లోజ్ అవుతున్నట్లు ఉండడంతో అరుణ్ కుమార్ కంగారు పడ్డాడు. మెసేజ్‌లో ‘వివరాల కోసం ఒక ఫోన్ నెంబర్ని సంప్రదించండి’ అని కూడా ఉండడంతో.. అరుణ్ కుమార్ ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా.. అవతల వ్యక్తి బ్యాంకు ఉద్యోగిగా పలకరించాడు.
బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఏవో ఆప్షన్లు తీసుకోవాలని చెప్పి ఆ వ్యక్తి నమ్మించాడు. అదంతా అరుణ్ కుమార్‌కు అర్థం కాకపోవడంతో ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేస్తే తానే అదంతా చేస్తానని చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ తన ఫోన్ స్క్రీన్ షేర్ చేశాడు. ఇదే అదునుగా ఆ వ్యక్తి అరుణ్ కుమార్ ఖాతా వివరాలు, ఫోన్ డేటా మొత్తం తీసేసుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపట్లో అరుణ్ కుమార్‌కు అతని రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.73 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అది చదివి ఆందోళన చెందిన అరుణ్ కుమార్ ఆ వ్యక్తికి మళ్లీ ఫోన్ చేయగా.. అతని నెంబర్ స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అరుణ్ కుమార్ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైం పోలీసులు ఆ డబ్బులు బీహార్‌కు చెందిన 34 అకౌంట్లలో ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుసుకున్నారు. ఆ 34 అకౌంట్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసుని విచారణ చేస్తున్న పోలీస్ అధికారి మాట్లుడుతూ.. “ఆ 34 అకౌంట్లు నకిలీవి.. ఆ ఖాతాదారులకు కొంతడబ్బు ఆశచూపి అందులో నుంచి మోసగాళ్లు మొత్తం రూ.73 లక్షలు తీసేసుకున్నారు. ప్రస్తుతం ఆ 34 ఖాతాదారులలో కొంతమంది ప్రశ్నిస్తున్నాం. వారిని మోసగాళ్లు ఎలా సంప్రదించారో తెలిస్తే ఆ దొంగలను పట్టుకోవచ్చు” అని వివరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

