మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్.. రూ. కోటిన్నర మోసం చేసిన దంపతులు
Uttar Pradesh | ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో చోటు చేసుకుంది.
లక్నో : ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్క చెందిన బబ్లూ కుమార్, పూజా కుమారి(బీహార్) కొన్నేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇక మోర్దాబాద్‌లో నివాసముంటూ, ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఆ సైట్లో అందమైన అబ్బాయిలు, అమ్మాయిల ఫోటోలను పెట్టి, ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించేవారు. ఇక వివాహం కోసం సంప్రదించే అమ్మాయిలు, అబ్బాయిలను మోసం చేస్తూ రూ. 1.6 కోట్లు వసూలు చేశారు.
అయితే ఓ వ్యక్తి తన కూతురికి పెళ్లి సంబంధం చూపిస్తామని చెప్పి, రూ. 27 లక్షలు వసూలు చేశారు. కానీ అబ్బాయిని చూపించకపోవడంతో మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అతను పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం 35 మందిని ఈ దంపతులు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం దంపతులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

