మూడో పెండ్లికి సిద్ధమైన భర్తను కడతేర్చిన భార్య

లక్నో : ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెండ్లికి సిద్ధమైన భర్త (మతపెద్ద)ను భార్య హత్య చేసింది. ముజఫర్‌నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మూడో భార్య కోసం మతపెద్ద ఉబలాటపడుతుండటంతో భర్తతో ఇద్దరు భార్యలు నిత్యం గొడవపడుతుండేవారని స్ధానికులు పేర్కొన్నారు. రోజూలాగే గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మతపెద్ద అహ్మద్ (57) ఇద్దరు భార్యలతో తన మూడో పెండ్లి ముచ్చటపై వాదనకు దిగాడు.
ఇద్దరు భార్యల్లో ఒకరైన హజ్రా ఇదే విషయమై అహ్మద్‌ను నిలదీసింది. దీంతో ఆయన హజ్రాను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం మనసులో పెట్టుకున్న హజ్రా అహ్మద్ నిద్రిస్తుండగా వంటింట్లో ఉపయోగించే కత్తితో భర్తపై విరుచుకుపడింది. అహ్మద్ మరణించడంతో బంధువుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
స్ధానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో మూడో పెండ్లి చేసుకుంటానని గొడవ పడుతుండటంతోనే భర్తను హతమార్చానని హజ్రా నేరం అంగీకరించింది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతుంటే మూడో భార్యను తీసుకురావాలని ఆయన ప్రయత్నించడంతో పట్టరాని ఆవేశంతో హత్య చేశానని పేర్కొంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

