కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థిని దారుణహత్య.. క్లాస్మేటే హంతకుడు..!
Student murder: పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్థిని దారుణహత్యకు గురైంది. తోటి విద్యార్థే అమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. కాలేజీ క్యాంపస్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది చూస్తుండగా

హైదరాబాద్: పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్థిని దారుణహత్యకు గురైంది. తోటి విద్యార్థే అమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. కాలేజీ క్యాంపస్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది చూస్తుండగా దారుణం జరిగింది. కొట్టాయం జిల్లా పాలా ఏరియాలోని సెయింట్ థామస్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కొట్టాయం జిల్లా వైకోమ్‌లోని తొలయోలపరంబుకు చెందిన నితినా మోల్ (22) సెయింట్ థామస్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నది. జిల్లాలోని వల్లచిరకు చెందిన అభిషేక్ (22) కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో నితినా మోల్ను అభిషేక్ తరచూ లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. తనతో మాట్లాడాలని, రొమాన్స్ చేయాలని వేధిస్తూ వస్తున్నాడు. అయితే నితినా అతడిని పక్కనపెడుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే శుక్రవారం నితినా, అభిషేక్ ఇద్దరూ పరీక్షలు రాసేందుకు వచ్చారు. అయితే, నితినాను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్న అభిషేక్ పరీక్ష మధ్యలోనే హాల్ నుంచి బయటకు వచ్చాడు. క్యాంపస్‌లోపలే నితినా ఎప్పుడు బయటి వస్తుందా అని ఎదురుచూశాడు. ఇంతలో నితినా రాగానే పేపర్ కట్టర్ సాయంతో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమైన నితినాను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది.

కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

