అనాజ్‌పూర్‌లో పసికందు హత్య.. చంపింది మేనత్తే..
అనాజ్‌పూర్ | అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో రెండు నెలల పసికందును హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పసికందును

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో రెండు నెలల పసికందును హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పసికందును చంపింది మేనత్త, మేనమామే అని పోలీసుల విచారణలో తేలింది. రెండు నెలల చిన్నారిని చంపి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో పడేశారు. మేనత్త శ్వేత, మేనమామ రాజుకు రెండేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికీ సంతానం కలగలేదు. తన ఆడపడుచుకు సంతానం కలగడంతో అసూయ పెంచుకున్న శ్వేత.. ఆ పసిబాబును కడతేర్చింది.
అనాజ్‌పూర్‌కు చెందిన లత, ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లికి చెందిన తిరుమలేశ్ దంపతులు. వీరు ఎల్బీనగర్లో ఉంటున్నా రు. వీరికి 12 ఏండ్ల తర్వాత సంతానం కలిగింది. బిడ్డ పుట్టగానే ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. 15 రోజుల క్రితం లత, బాబు ఉమామహేశ్వర్(2 నెలలు)తో కలిసి అనాజ్‌పూర్‌కు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి బాబుకు పాలు ఇచ్చి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లత నిద్రలేచి చూసే సరికి కొడుకు కనిపించలేదు. చివరకు ఇంటిపైన వాటర్ ట్యాంకులో శవమై కనిపించాడు. చనిపోయిన బిడ్డను చూసిన లత కన్నీరుమున్నీరైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

