‘బాంబ్’ అనడంతో ఇబ్బంది పడిన వృద్ధ దంపతులు… ఒక వ్యక్తి అరెస్ట్
తిరువనంతపురం: ‘బాంబ్’ అని అన్నందుకు ఒక వృద్ధుడితోపాటు అతడి భార్య ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కొచ్చీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. 63 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి విదేశీ ప్రయాణం కోసం శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు కొచ్చీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. చెక్ ఇన్ కౌంటర్ వద్ద లగేజీలో ఏం ఉందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడిగారు. అయితే ఆ వృద్ధుడు ‘బాంబ్’ అని అన్నాడు. దీంతో లగేజీ చెక్ ఇన్ సిబ్బంది వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని అలెర్ట్ చేశారు.
కాగా, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఆ వృద్ధ జంటను అదుపులోకి తీసుకున్నారు. నెడుంబస్సేరి పోలీసులకు వారిని అప్పగించారు. దీంతో లగేజ్‌లో బాంబ్ ఉందన్న వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై అతడ్ని విడుదల చేశారు. అయితే ‘బాంబ్’ అని ఊరికే అన్న వృద్ధుడి మాట, ఆ వృద్ధ జంటను ఇబ్బందులకు గురి చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

