పెళ్లికి నిరాకరించిన మహిళ… స్నేహితులతో కలిసి ప్రియుడు లైంగిక దాడి
పాట్నా: ఒక మహిళ పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీహార్లోని సీతామర్హి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళ, 27 ఏళ్ల మొహమ్మద్ కైష్ మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే ఆ మహిళ అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్ 24న కైష్, ఆ మహిళను ఒక ప్రాంతానికి పిలిపించాడు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ అపస్మారకంగా పడిఉండగా ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
మరునాడు తెలివిలోకి వచ్చిన తర్వాత బాధితురాలు జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధం కాగా, పంచాయితీ ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని నిందితులు, గ్రామస్తులు నచ్చజెప్పారు. ఆ వ్యక్తితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే 20 రోజులైనా నిందితులపై గ్రామ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

