హైదరాబాద్ : తనకు పెళ్లి కావడం లేదని ఓ యువకడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రా బ్యాంకు కూడలి వద్ద ఉన్న ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించారు. పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో, ఆ యువకుడు గత కొంతకాలం నుంచి కుంగిపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.