యువతి ప్రాణాలను బలిగొన్న యువకుడి వాట్సాప్ స్టేటస్
మంచిర్యాల : ఓ అమ్మాయి నిండు ప్రాణాలను ఆమె ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ బలిగొన్నది. ఈ ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన గంధం రాజయ్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగకు లత ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన ఫోటోలను బుధవారం వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. ఇది తెలుసుకున్న లత తల్లిదండ్రులు ఆ ఫోటోలను స్టేటస్ నుంచి తొలగించాలని అజయ్‌ను కోరారు. అతను వినిపించుకోలేదు. పైగా ఆ అమ్మాయి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన లత బుధవారం అర్ధరాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలిచంగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అజయ్‌పై లత తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

