వనపర్తి జిల్లాలో విషాదం.. రుణ యాప్ ఒత్తిడికి యువకుడు బలి
Wanaparthy Dist | రుణ యాప్ ఒత్తిడి భరించలేక ఓ యువకుడు ఉరేసుకున్నాడు. అతని ఫోటోకు నగ్నంగా ఉన్న యువకుడి చిత్రాన్ని జతపరిచి మానసికంగా వేధించారు. ఆ ఫోటోలను దోస్తులకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ
వనపర్తి : రుణ యాప్ ఒత్తిడి భరించలేక ఓ యువకుడు ఉరేసుకున్నాడు. అతని ఫోటోకు నగ్నంగా ఉన్న యువకుడి చిత్రాన్ని జతపరిచి మానసికంగా వేధించారు. ఆ ఫోటోలను దోస్తులకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోట పట్టణానికి చెందిన దాసరి శేఖర్(32) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఓ రుణ యాప్‌కు సంబంధించిన నిర్వాహకులు ఫోన్ చేసి, మీకు రుణం కావాలా? అని అడిగారు. ఆ తర్వాత అతని మొబైల్‌కు ఒక యాప్ పంపించారు. దాని ద్వారా శేఖర్ రూ. 2 వేలు రుణం పొందాడు. వారం రోజుల్లోనే ఆ డబ్బులను తిరిగి చెల్లించాడు. అయితే మరుసటి రోజే శేఖర్ ఖాతాలో మరో రూ. 2,500 జమ చేశారు. తనకు ఎలాంటి రుణం అవసరం లేదని చెప్పినప్పటికీ, బలవంతంగా అతని ఖాతాలో జమ చేశారు యాప్ నిర్వాహకులు. తిరిగి ఆ డబ్బులను చెల్లించాడు.
అయితే యాప్ నిర్వాహకులు.. శేఖర్ ఫోన్‌ను హ్యాక్ చేసి, అతని స్నేహితుల నంబర్లను తీసుకున్నారు. శేఖర్ మోసగాడు అని చెప్పి.. స్నేహితుల నంబర్లకు మేసేజ్‌లు పంపారు. ఆ భయంతో వరసుగా రూ. 30 వేలు చెల్లించాడు. మరో రూ. 40,000 చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఆ డబ్బులు కట్టకపోవడంతో.. శేఖర్ ఫోటోకు నగ్నంగా ఉన్న యువకుడి ఫోటోను జతపరిచి, స్నేహితులకు పంపారు. తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్ ఇవాళ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శేఖర్‌కు భార్య అమరావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

