Recipe | మీల్మేకర్తో టేస్టీ వడలు ఇలా చేసుకోండి..
సోయా గ్రాన్యూల్స్‌లో కొద్దిగా ఉప్పువేసి, వేడినీళ్లు పోసి గంటపాటు నానబెట్టి గట్టిగా పిండుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు బరకగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, మసాలా పొడి వేసి బాగా కలిపి ..శనగపిండి, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టి ముద్దలా కలుపుకోవాలి.
Recipe | మీల్ మేకర్ వడల తయారీకి కావలసిన పదార్థాలు
సోయా గ్రాన్యూల్స్ (మీల్ మేకర్స్): ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, శనగపప్పు: పావు కప్పు, శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, ధనియాలు: ఒక టీ స్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం, లవంగాలు: ఆరు.
తయారీ విధానం
సోయా గ్రాన్యూల్స్‌లో కొద్దిగా ఉప్పువేసి, వేడినీళ్లు పోసి గంటపాటు నానబెట్టి గట్టిగా పిండుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు బరకగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, మసాలా పొడి వేసి బాగా కలిపి ..శనగపిండి, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టి ముద్దలా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకుని, బాగా వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో ఒత్తుకుని వడలు వేసుకుంటే కరకరలాడే మీల్మేకర్ మసాలా వడలు సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

