Kitchen tips | కోసిన పండ్ల ముక్కలు రంగు మారొద్దంటే ఈ టిప్స్ పాటించండి..!
Kitchen tips | సాధారణంగా యాపిల్ లాంటి కొన్ని పండ్లను కోసినప్పుడు ఆ పండ్ల ముక్కలు రంగు మారుతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పండ్లు కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఆక్సిడేషన్ ప్రక్రియ. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా నిలువరించగలిగితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
Kitchen tips : సాధారణంగా యాపిల్ లాంటి కొన్ని పండ్లను కోసినప్పుడు ఆ పండ్ల ముక్కలు రంగు మారుతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పండ్లు కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఆక్సిడేషన్ ప్రక్రియ. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా నిలువరించగలిగితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలువరించడానికి పలు చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చిట్కాలు..
- పండ్లను నీళ్ల మధ్యలో ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల పండ్ల ముక్కలు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.
- అదేవిధంగా కోసిన పండ్ల ముక్కలను అల్లం ద్రావణంలో వేస్తే కూడా రంగు మారకుండా ఉంటాయి. అల్లంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది.
- ఒక బౌల్లో కొంచెం ఉప్పు వేసి అందులో పండ్ల ముక్కలను వేసి బాగా కలుపాలి. ఒక నిమిషం తర్వాత నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటే అవి రంగు మారకుండా ఉంటాయి.
- గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలుపాలి. అందులో పండ్ల ముక్కలను వేసి, 30 సెకన్ల తర్వాత బయటకు తీయాలి. ఇలా చేస్తే సుమారు 8 గంటలపాటు పండ్ల ముక్కలు రంగు మారకుండా తాజాగా కనిపిస్తాయి.
- ఒక బౌల్లో నీళ్లు పోసి ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపాలి. తర్వాత దానిలో పండ్ల ముక్కలను వేసి తీసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మ రసం అందుబాటులో లేకపోతే పైనాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ కూడా వాడవచ్చు. వాటిలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

