పనస శాండ్విచ్
ముందుగా కుక్కర్లో పనసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి లీటరు నీళ్లు పోసి.. నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పనస ముక్కల్ని ప్లేట్లో వేసి ఫోర్క్‌తో బాగా నొక్కాలి. ఒక గిన్నెలో క్యాబేజి, క్యారెట్ తురుము, తరిగిన టమాట, ఒక ఉల్లిగడ్డ తురుము, మిరియాల పొడి, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి వెజిటబుల్ సలాడ్ చేసి పెట్టుకోవాలి.
కావలసిన పదార్థాలు
పనసకాయ ముక్కలు: ఒక కప్పు (పచ్చివి), బ్రెడ్ స్లెసెస్: నాలుగు, క్యారెట్, క్యాబేజి తురుము: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఉల్లిగడ్డలు: రెండు, టమాట: ఒకటి, వెన్న: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: ఆరు, ఉప్పు: తగినంత, పసుపు: పావు టీస్పూన్, జీలకర్ర, ఆవాలు: పావు టీస్పూన్ చొప్పున, పెరుగు: అర కప్పు, మిరియాల పొడి: పావు టీస్పూన్.
తయారీ విధానం
ముందుగా కుక్కర్లో పనసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి లీటరు నీళ్లు పోసి.. నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పనస ముక్కల్ని ప్లేట్లో వేసి ఫోర్క్‌తో బాగా నొక్కాలి. ఒక గిన్నెలో క్యాబేజి, క్యారెట్ తురుము, తరిగిన టమాట, ఒక ఉల్లిగడ్డ తురుము, మిరియాల పొడి, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి వెజిటబుల్ సలాడ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు వేసి దోరగా వేయించాలి. బాగా వేగాక పనస మిశ్రమం, కారం, ఉప్పు జోడించి.. అయిదు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. స్టవ్‌మీద పెనం బాగా వేడయ్యాక వెన్న వేసి బ్రెడ్ ైస్లెసుల్ని రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక బ్రెడ్ ముక్కపై పనస మిశ్రమం, వెజిటబుల్ సలాడ్ పరిచి పైనుంచి మరో బ్రెడ్ ముక్క పెట్టుకుంటే నోరూరించే శాండ్విచ్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

