Gangavva | యూట్యూబ్ స్టార్ గంగవ్వ (Gangavva).. రాష్ట్రంలో ఈ పేరు తెలియనవారు ఎవరూ ఉండరూ. స్వచ్ఛమైన పల్లెటూరి మట్టి మనిషిలా.. పక్కింటి పెద్దవ్వగా తన సహజమైన యాసతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఆరు పదుల వయసులో కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నది. మై విలేజ్ షోతో (My Village Show) అందరికీ దగ్గరైన గంగవ్వ.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. గత నెల శివరాత్రి సందర్భంగా మొదటిసారి విమానం (First flight) ఎక్కి హల్చల్ చేసిన యూట్యూబర్ (YouTuber).. తన విమాన ప్రయాణం గురించి తెలుపుతు ఓ వీడియోను తన ఇన్‌స్టాలో (Instagram) పోస్ట్ చేసింది.
ఇప్పటివరకు ఈ క్లిప్‌కు ఆరు మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 5,38,957 మంది లైక్కొట్టారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దీంతోపాటు షెర్లు, లైక్ సంఖ్య కూడా అధికమవుతున్నది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోవి ధంగా స్పందిస్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటి వాటికి భాష అక్కర్లేదు అర్థమైపోతుందని ఒక ఇన్‌స్టా యూజర్ తెలుపగా, గంగవ్వ అందరికీ స్ఫూర్తి. విజయం ఏ వయసులోనైనా వస్తుంది.. పని చేస్తూ ఉండండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరి ఇది నిజమే కదా.. వయసుతో పనేముంది. కలలను సాకారం చేసుకోవడానికి..