Kakani Govardhan Reddy | ఆ రేవ్ పార్టీలో ఉన్న కారు నాది కాదు : ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఆదివారం ఓ రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు.
Rave Party | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఆదివారం ఓ రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పాలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలించారు. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఈ రేవ్ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో ఉన్న బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ రేవ్ పార్టీలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. బెంగళూరు (Bengaluru)లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో నాకు సంబంధం లేదు. ఆ కారు నాది కాదు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదని తెలిపారు. తన పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్లు ఫోన్ చేస్తే తనకు తెలిసిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే తనకు సంబంధం లేని ఘటనపై తాను స్పందించనని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

