Yatra-2 Movie | వైఎస్ఆర్ వాయిస్‌తో.. యాత్ర-2 మోషన్ పోస్టర్ రిలీజ్
Yatra-2 Movie Motion Poster | నాలుగేళ్ల కిందట వచ్చిన యాత్ర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది.
Yatra-2 Movie Motion Poster | నాలుగేళ్ల కిందట వచ్చిన యాత్ర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవించేశాడు. ఇక అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కాగా రీసెంట్గా ఈ సినిమా సీక్వెల్‌ను ఓ పోస్టర్‌తో అనౌన్స్‌చేశారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ ఓ డైలాగ్‌ను యాడ్ చేసి పోస్టర్‌ను వదిలారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక శనివారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్ చెప్పిన మాటలతో వీడియో స్టార్ట్ అయింది. చివర్లో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో మోషన్ పోస్టర్‌ను కంప్లీట్ చేశారు. విజువల్స్ మాత్రం వేరే లెవల్లో ఉన్నాయి. మోషన్ పోస్టర్‌నే ఈ రేంజ్లో దింపితే.. సినిమా ఇక ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆసక్తి క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రంగం నటుడు జీవా.. జగన్ మోహన్ రెడ్డి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

