‘కేజీఎఫ్’ ఫేం యశ్ నటిస్తూ.. ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న పానిండియా యాక్షన్ అడ్వెంచర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రెస్టేజియస్ మూవీ కన్నడం, ఆంగ్లం, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఫాదర్స్ డే’ని పురస్కరించుకొని ఆదివారం మేకర్స్ ఓ పోస్టర్ని విడుదల చేశారు.
రెండు విభిన్నమైన రూపాల్లో ఉన్న యశ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఇక ఆగస్ట్ 26 బుధవారం కావడం, వరలక్ష్మీవ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ పర్వదినాలు కలిసిరావడం, అన్నింటినీ మించి హాలిడేస్‌తో కూడిన లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమాకు భారీ వసూళ్లు పక్కా అని మేకర్స్ భావించి, ఈ డేట్‌ని ఖరారు చేశారట. ఆడియన్స్‌కి ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ‘టాక్సిక్’ ఉంటుందని, పానిండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.