Toxic The Movie | రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని హీరో యష్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒరిజినల్‌గా రూపొందుతోంది. యష్‌తో పాటు లేడీ సూపర్‌స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నారు.
అంతర్జాతీయ సంక్షోభం కారణాల వల్ల గతంలో ‘టాక్సిక్’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మేకర్స్ ఫైనల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో “Honour Thy Father” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్యాగ్‌లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ బజ్ నెలకొంది. గోటాబయ రాజపక్సే కాలంలో శ్రీలంకలో జరిగిన డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామాతో పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 26, 2026న ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Honour Thy Father…#Toxic In Cinemas Worldwide from 26-08-2026#ToxicTheMovie#ToxicOn26thAug@TheNameIsYash#Nayanthara @advani_kiara #TaraSutaria @humasqureshi @rukminitweets #GeetuMohandas @VishalMMishra #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/FMstz2MY4R
— KVN Productions (@KvnProductions) June 21, 2026