Yashodha Movie On OTT | సరోగసి నేపథ్యంలో సమంత నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించింది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11న రిలీజై ఘన విజయం సాధించింది. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా పోటీగా సినిమాలేవి లేకపోవడంతో ప్రేక్షకులు యశోదకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో గర్భిణిగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా హక్కులను ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాపై కొన్ని వివాదాలు నెలకోవడంతో డిజిటల్ రిలీజ్‌కు ఆలస్యమైంది. ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. ఈ వివాదం కాస్త యశోద సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు ఆలస్యానికి కారణం అయ్యింది. దీంతో ఆ ఆస్పత్రి వర్గాలతో యశోద మేకర్స్ చర్చించి సమస్యను పరిష్కారించారు. ఇక ఇప్పుడు లైన్ క్లియర్ అవడంతో యశోదను స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. దీనితో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.