Toxic | కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash) టాక్సిక్ (Toxic) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ డైరెక్షన్లో A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. యశ్ 19వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) కీ రోల్లో నటిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు.
1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో సినిమా సాగనుందట. బెంగళూరులో వేసిన భారీ సెట్స్‌లో అగ్రభాగం టాక్సిక్ షూటింగ్ కొనసాగిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కొంతభాగం శ్రీలంకలో కూడా షూట్ చేయనున్నారట మేకర్స్. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుండగా.. కియారా అద్వానీ కూడా కీ రోల్ పోషిస్తుందన్న వార్త వైరల్ అవుతుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కేజీఎఫ్ 2 తర్వాత కొత్త సినిమాకు చాలా సమయం తీసుకున్న యశ్.. మరి టాక్సిక్‌లో ఎలాంటి అవతార్‌లో కనిపించబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ బయటకు వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి టాక్సిక్ కొత్త షెడ్యూల్ షురూ కానుంది. బ్రదర్, సిస్టర్ మధ్య జరిగే కథాంశంతో టాక్సిస్ ఉండబోతుండగా.. పవర్ ఫుల్ రోల్లో కరీనాకపూర్‌ను తీసుకోవడం పట్ల గీతు మోహన్ దాస్ చాలా ఎక్జయిటింగ్‌గా ఉందట.
టాక్సిక్ గ్లింప్స్ వీడియో..