‘కేజీఎఫ్’ ఫేమ్ పాన్ ఇండియాస్టార్ యశ్ నటించిన ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులో ‘రారాజు’పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. మహేష్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. యశ్ సతీమణి రాధిక పండిట్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడం విశేషం’ అన్నారు.