రావణుడి పాత్రకు యష్ తిరస్కారం
కేజీఎఫ్-2’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిత్ర హీరో యష్ నుంచి ఇప్పటివరకు మరో సినిమా ప్రకటన రాలేదు. ఆయన తదుపరి సినిమా ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.
‘కేజీఎఫ్-2’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిత్ర హీరో యష్ నుంచి ఇప్పటివరకు మరో సినిమా ప్రకటన రాలేదు. ఆయన తదుపరి సినిమా ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా నిర్మాత మధు మంతెన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘రామాయణం’ చిత్రంలో యష్ రావణుడి పాత్రలో నటించనున్నారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. నితీష్ తివారి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రణభీర్‌కపూర్ రాముడి పాత్రలో నటించబోతున్నారు. అయితే యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారనే వార్తలను ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. ‘
పాత్రల ఎంపికలో యష్ అభిమానుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. నెగెటివ్ పాత్రల్లో అస్సలు నటించరు. రావణుడి పాత్రలో ఆయన నటించడం లేదు. అవన్నీ వదంతులే’ అని యష్ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ సినిమాలో రావణుడి పాత్ర కోసం గతంలో అగ్ర హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించగా ఆయన కూడా తిరస్కరించారు. రావణుడి పాత్రలో పాపులర్ హీరోను నటింపజేయాలనే ప్రయత్నంలో చిత్రబృందం ఉందని, అందుకే ఈ సినిమా సెట్స్‌మీదకు రావడానికి మరింత సమయం పడుతుందని అంటున్నారు. ఇక యష్ తన తదుపరి చిత్రాన్ని నర్తన్ దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

