ఆ తపన నీలో ఇంకా తగ్గలేదు
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనాకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న భారీ పానిండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక.
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనాకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న భారీ పానిండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. సోమవారం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా పోస్టు ద్వారా విజయ్ దేవరకొండ స్పందిస్తూ “టాక్సీవాలా’ సినిమా చేసి తొమ్మిదేళ్లవుతున్నది. ఈ తొమ్మిదేళ్లలో మన జీవితాలు ఎంతో మారాయి. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం ఇప్పటికీ నీలో తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు సినిమాలే అయినా.. ఎన్నో పోరాటాలు చేశాం. తొలి సినిమాతో ప్రేక్షకాదరణ, ప్రేమ అందుకున్నాం. ‘రణబాలి’తో మరో విజయం సాధించాలి. రణబాలిగా నటించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా. నీ ప్రతి ప్రయత్నం సఫలం కావాలి. మన సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా! అని వేచి చూస్తున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

