మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగనున్నాయి. ‘మా’ కోసం సొంత భవన నిర్మాణమే ప్రధాన ఎజెండాగా అధ్యక్ష పోటీదారులంతా ప్రచారం చేస్తున్నారు. ‘మా’ భవన నిర్మాణ కల త్వరలో నిజం కాబోతుందని అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు సొంత భవనం ఉండాలనేది అందరి కల. ఆ కల త్వరలో నిజం కాబోతుంది. భవన నిర్మాణం కోసం నేను స్వయంగా మూడు స్థలాల్ని చూడటం జరిగింది. వాటిలో ఏది అత్యుత్తమం అనేది అందరం కూర్చొని డిసైడ్ చేద్దాం’ అంటూ ఈ వీడియోలో మంచు విష్ణు పేర్కొన్నారు.