Will Smith | అల్లు అర్జున్ ‘రాకా’ మూవీలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్?
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎపిక్ 'రాకా' సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
Will Smith | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎపిక్ ‘రాకా’ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తుండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ రూమర్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్ ప్రధాన విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, విల్ స్మిత్ ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ విదేశీ లొకేషన్లలో జరగనుందని, దీనికి సంబంధించి ఇప్పటికే కాస్ట్యూమ్స్ కూడా లాక్ చేశారని సమాచారం. అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమా షూటింగ్ ముగించుకున్న తర్వాత, షారుఖ్ ఖాన్ ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత ‘రాకా’ చిత్ర విదేశీ షెడ్యూల్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని, పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో దీపికా పదుకొనే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్ ‘రాకా’ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

