శ్రియ కూతురికి రాధా అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా..?

shriya saran daughter radha | టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందరితో నటించింది ఈమె. టాలీవుడ్లో దాదాపు 50 సినిమాలకు పైగా నటించి ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లిపోయింది. ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది శ్రియ. ఏడాది పాటు ఈమె విషయం దాచేసింది. ఈమె అమ్మ అయిన సంగతి కనీసం బయటికి కూడా రానీకుండా 365 రోజులు దాచేసింది. తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి ఈ మధ్య అభిమానులతో పంచుకుంది. 2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి ఫుల్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. భర్తతో ఉన్న ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తున్నట్లు అభిమానులతో చెప్తుంది ఈ బ్యూటీ. పైగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ బాగోగులు కూడా చెబుతుంది శ్రియ సరన్.
అలాంటిది తాను గర్భం దాల్చిన సంగతి.. అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి మాత్రం చెప్పలేదు. కనీసం అలాంటి న్యూస్ కూడా ఎప్పుడూ పోస్ట్ చేయలేదు శ్రియ. అప్పటికే తన దగ్గర ఉన్న పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను మోసం చేస్తూనే వచ్చింది. 2020 లోనే శ్రియ ఓ పాపకు జన్మనిచ్చింది ఆ పాపకు ఏడాది వయసు ఎప్పుడొచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను పెళ్లాడింది శ్రీయ. గతేడాది స్పెయిన్లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడికి వెకేషన్ కు వెళ్లిన శ్రియ దంపతులు.. లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయారు. ఏడాది పాటు అక్కడే ఉన్నారు. అదే సమయంలో పాపకు జన్మనిచ్చింది శ్రియ.
ఈ విషయాన్ని పాపకు ఏడాది వయసు వచ్చే వరకు దాచేసింది. ఈ పాపకు రాధా అనే పేరు పెట్టింది శ్రియ. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఇప్పుడు చెప్పింది. తన భర్తది రష్యా అని.. రష్యన్లో రాధా అంటే సంతోషం అని అర్థం వస్తుంది అని చెప్పింది. అలాగే పాప పుట్టిందని విషయాన్ని తన అమ్మకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే రాధా రాణి వచ్చింది అంటూ చెప్పిందని.. అదే విషయం తన భర్తకు చెప్తే ఆ పేరు పెట్టేద్దాం అని చెప్పినట్లు తెలిపింది శ్రియ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shriya Saran | పెద్ద సీక్రెట్ దాచేసిన శ్రియా..షాక్లో అభిమానులు..!
Shriya Saran | భర్తతో కలిసి కొత్తింట్లోకి మారిన శ్రియాశరణ్
Shriya Saran | తల లేకుండా శ్రియని పరుగెత్తించిన వ్యక్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

