BB Telugu Grand Finale | బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగింపుకు ముహూర్తం దగ్గరపడింది. టాప్ 3 నుంచి శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో ఇక మిగిలింది సన్నీ, షణ్ముఖ్. ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ 5 విన్నర్ కాబోతున్నారు.
శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యాక.. స్పెషల్ గెస్ట్ నాగ చైతన్య అతడిని బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీదికి మరో స్పెషల్ గెస్ట్‌గా జాతిరత్నం చిట్టి వచ్చేసింది. జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్టేజ్ మీద కాసేపు అలరించింది. బంగార్రాజు సినిమాలో ఫరియా ఐటెమ్ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే.
తను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి.. ఇద్దరు ఫైనలిస్టులు సన్నీ, షణ్ముఖ్‌ను స్టేజ్ మీదికి తీసుకెళ్లింది. ఇక మిగిలిన ఇద్దరిలో ఎవరు విన్నరో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.