Hanuman | షాకింగ్.. హనుమాన్ సినిమాలో ఆంజనేయుడు అతడేనా..?
Hanuman | హనుమాన్ సినిమాలో హనుమంతుడు ఎవరు? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది. కాకపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం తమ సినిమాలో హనుమంతుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పడం లేదు. అడిగినా కూడా చెప్పను అనే సమాధానమే చెప్తున్నాడు తప్ప.. సినిమాలో హనుమాన్ ఎవరు అనే విషయం నోరు జారడం లేదు.
Hanuman | హనుమాన్ సినిమాలో హనుమంతుడు ఎవరు? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది. కాకపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం తమ సినిమాలో హనుమంతుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పడం లేదు. అడిగినా కూడా చెప్పను అనే సమాధానమే చెప్తున్నాడు తప్ప.. సినిమాలో హనుమాన్ ఎవరు అనే విషయం నోరు జారడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో హనుమంతుడు ఎవరు.. ఆ పాత్రలో ఎవరు నటించారు అనే ఆసక్తి చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. దీని మీద చర్చ నడుస్తున్న కూడా ఎక్కడ ఏ చిన్న లీక్ కూడా బయటకు రాలేదు.. రానివ్వలేదు దర్శక నిర్మాతలు. ఎందుకంటే తమ సినిమాకు బ్రహ్మ పదార్థం ఇదే అని బలంగా నమ్ముతున్నాడు ప్రశాంత్ వర్మ.
ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సినిమాలో హనుమంతుడు ఎవరు అంటూ యాంకర్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ప్రశాంతంగా నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మీకు మాత్రమే కాదు సార్.. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడను.. ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే అంటూ తెగేసి చెప్పాడు ప్రశాంత్. రేపు థియేటర్లలో ఆ క్యారెక్టర్ ఎవరు పోషించారో చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవ్వాలి అనేది మా ఆలోచన. అందుకే ఎక్కడా దీని గురించి చెప్పడం లేదు అంటూ మరింత ఆసక్తి పెంచాడు ఈ దర్శకుడు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ బట్టి చూస్తే హనుమాన్ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ చేసింది ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వర్షన్ అని తెలుస్తుంది.
పెరిగిన టెక్నాలజీని వాడుకుని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చిరంజీవిని రీ క్రియేట్ చేశారని ప్రచారం జరుగుతుంది. మొన్న విడుదలైన ట్రైలర్లో హనుమంతుడి కళ్ళు కూడా సేమ్ చిరంజీవి కళ్ళ మాదిరే ఉన్నాయి. ఇదే విషయం దర్శకుడుని అడిగితే అవి చిరంజీవి కళ్ళే అని ఒప్పుకున్నాడు కూడా. మరి చిరంజీవిని డిజిటల్‌గా చూపించారా అని అడిగితే మాత్రం దానికి ఎలాంటి సమాధానం చెప్పట్లేదు ప్రశాంత్. అది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి అని చెప్పుకొచ్చాడు. ఆయన మాటల్ని బట్టి చూస్తే మాత్రం హనుమాన్ సినిమాలో కచ్చితంగా చిరంజీవి రిఫరెన్స్ వాడుకున్నారని అర్థమవుతుంది. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. జనవరి 7న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే జనవరి 12 రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

