Imanvi Esmail | రొట్టె విరిగి నెయ్యిలో పడింది.. ప్రభాస్ హీరోయిన్ కోసం క్యూకట్టిన నిర్మాతలు
ప్రభాస్ పక్కన కథానాయికగా కొత్తమ్మాయి అనగానే, సోషల్‌మీడియా ఫోకస్ అంతా ప్రస్తుతం ఇమాన్వీ ఇస్మాయిల్ పైనే. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ్నుంచొచ్చింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ప్రభాస్ పుణ్యమా అని రాత్రికి రాత్రి ఈ అమ్మాయి స్టేటస్ మారిపోయింది. తన ఇన్‌స్టాలో ఏకంగా లక్షమంది ఫాలోవర్లు ఒక్కరోజులో పెరిగిపోయారు.
Imanvi Esmail | ప్రభాస్ పక్కన కథానాయికగా కొత్తమ్మాయి అనగానే, సోషల్‌మీడియా ఫోకస్ అంతా ప్రస్తుతం ఇమాన్వీ ఇస్మాయిల్ పైనే. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ్నుంచొచ్చింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ప్రభాస్ పుణ్యమా అని రాత్రికి రాత్రి ఈ అమ్మాయి స్టేటస్ మారిపోయింది. తన ఇన్‌స్టాలో ఏకంగా లక్షమంది ఫాలోవర్లు ఒక్కరోజులో పెరిగిపోయారు. శంఖంలో పోస్తేనే కదా తీర్థం అన్నట్టు, ప్రభాస్ పక్కన హీరోయిన్ అనగానే స్టార్ అయి కూర్చుంది ఇమాన్వీ.
బడా నిర్మాతలంతా ప్రభాస్ సినిమా తర్వాత తమ సినిమాల్లో ఈ అమ్మాయిని నటింపజేయడానికి అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే.. మైత్రీ మూవీమేకర్స్ వాళ్లు మాత్రం తమ సంస్థలో ముందు మూడు సినిమాలు చేసేంతవరకూ ఇతర సినిమాలు ఒప్పుకోకూడదని కండీషన్ పెట్టారట ఈ ముద్దుగుమ్మకు. అంతేకాదు, దర్శకుడు అను రాఘవపూడి కూడా తన సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయడానికి వీల్లేదని షరతు విధించారట.
ప్రభాస్‌తో ఆయన చేసే సినిమాకు కథానాయిక ఎవరైనా సరే, బల్క్ డేట్లు తనకు అవసరమట. పిలిచినప్పుడల్లా సెట్‌కి రావాల్సి ఉంటుందట. అందుకే బిజీ కథానాయికలను పక్కనపెట్టి ఇమాన్వీని తీసుకున్నారట అను రాఘవపూడి. ఏదేమైనా ఈ అందాలభామ రొట్టె విరిగి నేతిలో పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

