9గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి సినిమా చిత్రీకరణ పూర్తిచేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాం అన్నారు దర్శకుడు శివ. ఆయన దర్శకత్వంలో గ్రంథి శివకుమార్ నిర్మాతగా ‘జబర్దస్త్’ ఫేమ్ అదిరే అభి హీరోగా రూపొందిన చిత్రం ‘వైట్ పేపర్’. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరి సపోర్ట్‌తో అతి తక్కువ వ్యవధిలో పూర్తిచేశాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు మా చిత్రాన్ని గుర్తించడం ఆనందంగా వుంది’ అన్నారు.