సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహా ఉల్లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భవనం’. బాలా చారి కూరెళ్ల దర్శకుడు. ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి నిర్మాతలు. శుక్రవారం ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ‘ది హాంటెడ్ హౌస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంది. ఓ భవనం నేపథ్యంలో నడిచే వినోదాత్మక హారర్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: చరణ్ అర్జున్, రచన, మాటలు, దర్శకత్వం: బాలా చారి కూరెళ్ల.