Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఐకానిక్ ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో భాగంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ దాదాపు 4 నిమిషాల నిడివితో ఫుల్-టు-ఫుల్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నవ్వుల రైడ్‌లా సాగింది. ముఖ్యంగా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్ మళ్లీ తెరపై మ్యాజిక్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘హేరా ఫేరి’ నాటి వీరి కెమిస్ట్రీని ఈ సినిమా గుర్తుకు తెస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో, ఫిరోజ్ ఎ. నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సునీల్ శెట్టి, అర్షద్ వార్సి, పరేష్ రావల్, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, లారా దత్తా, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, శ్రేయాస్ తల్పడే మరియు దలేర్ మెహందీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.