అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదంతో కూడిన ప్రేమకథ ఇది.
రీసెంట్ అండ్ రీస్టార్ట్ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోతుందా? అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ లవ్‌స్టోరీలో ప్రతీ అంశం ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. చమ్మక్ చంద్ర, జయలలిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మదీన్ ఎస్కే.